NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీ.. ఇంట‌ర్మీడియట్ హాల్ టికెట్లు ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలో ఈనెల ఆరో తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్‌ పరీక్షల హాల్‌టిక్కెట్లను అధికారులు బోర్డు వెబ్‌సైట్‌ లో ఉంచారు. విద్యార్థులంతా నేరుగా వెబ్‌సైట్‌ నుంచి వీటిని డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్షలకు హాజరుకావచ్చునని అధికారులు పేర్కొన్నారు. హాల్‌టిక్కెట్లపై కళాశాలల ప్రిన్సిపాళ్ల సంతకాలు అవసరం లేదన్నారు. హాజరు అర్హత కలిగిన ప్రతి విద్యార్థీ ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టిక్కెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే సౌలభ్యం కల్పించారు. ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాలు ఏటా ఫీజు బకాయిలతో హాల్‌టిక్కెట్లకు లింకు పెడుతున్నాయి. దీంతో కొందరు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకే అధికారులు ఈ చర్యలు తీసుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రతి విద్యార్థి ఆధార్‌ నంబర్‌ లేదా హాల్‌టికెట్‌ నంబర్‌తో బోర్డు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టిక్కెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని, పరీక్షలు రాసే అవకాశం కల్పించారు.

                                   

,

About Author