`ఆహార భద్రత`లో ఏపీ మూడో స్థానం
1 min readపల్లెవెలుగువెబ్ : దేశవ్యాప్తంగా ఆహార భద్రతాచట్టం అమలులో ఒడిసా ప్రథమస్థానంలో నిలిచింది. ఈ చట్టం బాగా అమలవుతున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ మూడోస్థానంలో ఉండగా, తెలంగాణ 12వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో జరిగిన రాష్ట్రాల ఆహార మంత్రుల సదస్సులో 2022 సంవత్సరానికిగాను రాష్ట్రాలకు ర్యాంకులను కేంద్రం ప్రకటించింది. కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆ ర్యాంకుల వివరాలను సదస్సులో వెల్లడించారు. చౌకదుకాణాల్లో పౌర సరఫరాల తీరుతెన్నులు ప్రమాణంగా సూచీలను రూపొందించారు. ఇందులో 0.836 స్కోరుతో ఒడిసా ముందు వరసలో నిలవగా, ఉత్తరప్రదేశ్ 0.797 స్కోరు చేసి ద్వితీయస్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ 0.794 స్కోరు దక్కించుకుని మూడో ర్యాంకు సొంతం చేసుకుంది.