NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంగన్ వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

1 min read

ఈనెల 23 చివరి తేదీ-నందికొట్కూర్ సిడిపిఓ మంగవల్లి..

నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో 14 ఆయా పోస్టులకు గాను దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు నందికొట్కూరు సిడిపిఓ బిఏ. మంగవల్లి బుధవారం సాయంత్రం తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దరఖాస్తులు చేయదలచిన వారు పదవ తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి.అభ్యర్థికి వివాహం అయి ఉండి స్థానిక గ్రామంలో నివాసం ఉండాలి.1.7.2025 నాటికి  21 సం.ల నుండి 35 సం.ల లోపు ఉండాలి. దరఖాస్తులను గెజిటెడ్ అధికారితో సెల్ఫ్ అటెస్టేషన్ చేయించాలన్నారు. దరఖాస్తులను (నిన్న) 15వ తేదీ నుండి ఈనెల 23 వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులను నందికొట్కూరు సిడిపిఓ కార్యాలయంలో అందజేయాలని అన్నారు.

గ్రామాల వారీగా ఖాళీలు మరియు రిజర్వేషన్ల వివరాలు

నందికొట్కూరు మండలంలో ఆరవ అంగన్వాడి కేంద్రం- (బిసి),20వ అంగన్వాడి కేంద్రం-(ఓసి)..మిడుతూరు మండలం:పైపాలెం-(ఓసీ), చౌటుకూరు మూడవ అంగన్వాడి కేంద్రం-(బిసీ-డి)..పగిడ్యాల మండలం: లక్ష్మాపురం ఒకటవ కేంద్రం- (ఓసి),ఆంజనేయ నగర్-(ఓసి) (ఈడబ్ల్యూ ఎస్).. పాములపాడు మండలం: మిట్టకందాల మూడవ కేంద్రం- (బిసి-సి)..కొత్తపల్లి మండలం: పి సిద్దేశ్వరం (బిసి-బి), ముసలిమడుగు ఒకటవ కేంద్రం-(ఓసి), జి వీరాపురం రెండవ కేంద్రం-(ఓసి- వికలాంగులు),సింగరాజుపల్లి మూడవ కేంద్రం-(ఎస్సీ), పెద్ద గుమ్మడాపురం గూడెం-(ఎస్టీ), జనాల గూడెం-(ఎస్సీ) ముసలిమడుగు గూడెం- (ఎస్టీ) పైన కనబరిచిన అంగన్వాడీ కేంద్రాల్లో ఆయా పోస్టులకు గాను అర్హులైన మహిళలు ఈనెల 23వ తేదీ సాయంత్రం లోపు దరఖాస్తులు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని సిడిపిఓ మంగవల్లి కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *