NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో అరుదైన పెద్ద ట్యూమర్ కు శస్త్రచికిత్స విజయవంతం”

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: కర్నూల్ మెడికల్ కాలేజీ సర్జరీ విభాగపు వైద్యులు మరోసారి తమ ప్రతిభను చాటుతూ, ఒక అరుదైన మరియు క్లిష్టమైన Retroperitoneal Liposarcoma కేసును విజయవంతంగా శస్త్రచికిత్స ద్వారా చికిత్స నిర్వహించడం జరిగింది.కర్నూలు జిల్లాకు కొత్త బురుజుకు చెందిన 75 సంవత్సరాల వయసు గల ముత్తయ్య అనే  రోగి 6/4/2026 తేదీన కడుపులో నొప్పి మరియు వాపుతో కర్నూల్ గవర్నమెంట్ ఆసుపత్రిలో  చేరగా, సర్జరీ విభాగపు ఫస్ట్ యూనిట్ వైద్యులు వైద్యులు వివిధ పరీక్షలు నిర్వహించి పరిశీలించినప్పుడు, రోగికి పొట్ట వెనుక భాగంలో సుమారు 30 సెం.మీ × 20 సెం.మీ పరిమాణంలో భారీ ట్యూమర్ ఉన్నట్లు గుర్తించారు. ఈ ట్యూమర్ ముఖ్య అవయవాలైన కిడ్నీ వంటి భాగాలకు దగ్గరగా ఉండడం వల్ల శస్త్రచికిత్స అత్యంత క్లిష్టంగా మారింది.ఈ కేసును  జనరల్ సర్జరీ విభాగం వైద్య బృందం సమగ్రంగా పరిశీలించి, సమన్వయంతో శస్త్రచికిత్స నిర్వహించారు. శస్త్రచికిత్సలో ట్యూమర్‌ను పూర్తిగా తొలగించడం తో పాటు, అవసరమైన చోట కిడ్నీపై వైద్య జోక్యం చేపట్టి రోగిని ప్రాణాపాయం నుంచి రక్షించారు.ఈ విజయవంతమైన శస్త్రచికిత్సలో పాల్గొన్న వైద్య బృందంలో వైస్ ప్రిన్సిపల్, సర్జరీ విభాగపు అధిపతి డా. హరి చరణ్, అసోసియేట్ డాక్టర్ విజయబాబు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ నరేష్ అసిస్టెంట్లు డాక్టర్ మహేష్ తజ్మహల్ హుస్సేన్, అనస్తీసియా విభాగం నుండి ప్రొఫెసర్ డాక్టర్ రామ శివ నాయక్,డా. అరుణలత డాక్టర్ భార్గవ్ మరియుఇతర వైద్యులు మరియు సిబ్బందిప్రధాన పాత్ర పోషించారు.శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్యం స్థిరంగా ఉండి, కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.ఈ సందర్భంగా అడిషనల్ డిఎంఇ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు  వైద్య బృందాన్ని అభినందిస్తూ, ఇటువంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించడం ద్వారా సంస్థ ప్రతిష్టను మరింత పెంచారని తెలిపారు.కర్నూల్ మెడికల్ కాలేజీ సర్జరీ విభాగపు హెచ్ ఓ డి డా. హరిచరణ్ ఆధ్వర్యంలో నేడు మూడు గంటల పైగా శ్రమించి  శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది . వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా రోగికి ఉచితంగా సర్జరీ చేసి అన్ని సేవలు అందించడం జరిగింది అని తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *