అంగన్వాడీ సహాయకురాలు పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
1 min read
స్థానికులై వివాహిత మహిళలు మాత్రమే అర్హులు
దరఖాస్తులు ఈ నెల 17వ తేదీ లోగా సమర్పించాలి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు,పెదపాడు ఐ.సి.డి.యస్. ప్రాజెక్టు పరిదిలోని ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకురాలు మరియు మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నట్లు ఏలూరు అర్బన్ ఇన్ చార్జి సిడిపివో కె. విజయలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏలూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని వంగాయగూడెం, వెంకటాపురము-1 (సుంకర వారి తోట), బాప్టిస్ట్ పేట, కొబ్బరి తోట-3, శాస్త్రి సెంటర్, కుమ్మర గొయ్య (శనివారపు పేట), తంగెళ్ళమూడి-1, తంగెళ్ళమూడి-2 , పైడి చింతపాడు, మొండెల కాలనీ (వెంకట పురం-2), బోరాయి గూడెం (వెంకటపురం-8), మొండికోడు, కోమడవోలు -3, ఫిరంగుల దిబ్బ-1, పెద యాగనమిల్లి యందు మరియు పెదపాడు ఐ.సి.డి.యస్. ప్రాజెక్టు పరిదిలోని బాపిరాజుగూడెం-2, రాయన్నపాలెం-3, సీతారంపురం, ఏపూరు, రామసింగవరం-1వేగివాడ-1, జగనాధపురం-1, చింతలపాటివారిగూడెం, వడ్డిగూడెం, వసంతవాడ-3, పెదపాడు, శ్రీరామవరం-2, పోతునూరు-1 మలకచర్ల, అంజలిపురం ,సత్యనారాయణపురం, సానిగూడెం మినీ యందు అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకురాలు మరియు మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టుల పోస్ట్లు ఖాళీలు ఉన్నాయన్నారు. స్థానికులైన వివాహిత మహిళలు మాత్రమే అర్హులన్నారు.వయసు తేది.01.07.2025 తేదికి 21 సం.నిండి 35 సం.లోపు ఉండాలి,కనీస విద్యార్హత 10 వ తరగతి ఉత్తీర్ణులై వుండవలెను.అదనపు విద్యార్హతలకు ప్రాముఖ్యత ఇవ్వబడదన్నారు. వికలాంగులైనచో అతి తక్కువ స్థాయి అంగవైకల్యము కలిగిన వారు మాత్రమే పరిశీలించడం జరుగుతుందన్నారు.ఆయా అంగన్వాడీ కేంద్ర పరిది లోని అర్హులైన మహిళా అభ్యర్ధులు దరఖాస్తులను సంబంధిత ఏలూరు ఐ.సి.డి.యస్. ప్రాజెక్టు, స్విమ్మింగ్ పూల్ వెనుక, ఎఎస్ఆర్ స్టేడియం దగ్గర, రైల్వే స్టేషన్ వద్ద, ఏలూరు కార్యాలయం నందు సంబంధిత దృవ పత్రాల నకళ్ళ తో ఈనెల 17వ తేదీ లోగా సమర్పించాలన్నారు. నోటిఫికేషన్ నియమ నిబంధనలకు,రోస్టర్ పాయింట్ లకు లోబడి ఎంపిక చేస్తారని, పోస్టుల ఖాళీలు,తదితర వివరాలకు తమ కార్యాలయంలో సంప్రతించవచ్చని, లేదా కె.వేంకటేష్ (9949369004).జూనియర్ అసిస్టెంట్, ఏలూరు వారిని సంప్రదించవచ్చన్నారు.
