తెలుగు గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోండి
1 min read
ప్రిన్సిపాల్ నయిమున్నిసాబి
న్యూస్ నేడు, పత్తికొండ: పత్తికొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు సబ్జెక్టు లెక్చరర్ పోస్టు ఖాళీగా ఉందని, అర్హత కలిగిన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నయిమున్నిసా బి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు సబ్జెక్టు బోధించేందుకు ఎంఏ తెలుగు అర్హత అని, ఎంఏ తెలుగు పిజి యందు 55% పైన మార్కులు కలిగిన నిరుద్యోగులు రెస్యూమ్ తో పాటు అర్హత కలిగిన ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు తీసుకురావాలని వివరించారు. ఈనెల 14, 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసుకోలేని నిరుద్యోగులు సోమవారం ఉదయం 10 గంటలకు నేరుగా కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం డెమో క్లాసు ఉంటుందని, ఏపీ ఇంటర్మీడియట్ విద్యాశాఖ నిర్ణయించిన ప్రకారం గౌరవ వేతనం అందజేస్తామని తెలిపారు.


