‘ఉత్తమ ఉపాధ్యాయ’ అవార్డుకు దరఖాస్తులు చేసుకోండి: డీఈఓ
1 min readపల్లెవెలుగువెబ్: రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డులకు ఉపాద్యాయులను నామినేట్ చేయుటకు అర్హత గల ఉపాద్యాయుల నుండి మరియు పదవి విరమణ’ ఉపాద్యాయుల నుండి ధరఖాస్తులను సంబంధిత ఉప విద్యాధికారి లేదా మండల విద్యాధికారి ద్వారా జిల్లా విద్యాధికారి కార్యాలయమునకు 20.08.2022 నుండి 24.08.2022 లోగా ధరఖాస్థులు సమర్పించవలయును. 24.08.2022 సాయంత్రము 5.00 గంటల తరువాత వచ్చిన ధరఖాస్థులు స్వీకరించబడవు. ప్రదానోపాద్యాయులు, స్కూల్ అసిస్టెంట్, ఎస్టీ కేటగిరిలో ధరఖాస్తులు పంపించాలని సూచించింది. ఉమ్మడి 13 జిల్లాలకు సంబందించి జిల్లాకో పదివీ విరమణ చేసిన టీచర్ ను సిఫార్సు చేయాలని వెల్లడించింది. “నాడు- నేడు”. గత రెండేళ్లలో ప్రవేశాల పెంపు, మరుగు దొడ్లు, పాఠశాల నిర్వహణ యాప్ లు, మద్యాహ్న భోజనం హాజరు నమోదు, సకాలంలో అమ్మఒడి డాటా పరిశీలన పూర్తి, జగనన్న విద్యా కానుక పంపిణీ, కోవిడ్ సమయంలో బోధనకు తీసుకున్న ప్రత్యేక చర్యలను అవార్డుకు ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది. ఉపాద్యాయులు మరియు ప్రధాన ఉపాద్యాయులు 15 సంవత్సరాలు పూర్తి చేసి, గతం లో జిల్లా లో అవార్డ్. లు పొందిన వారు అర్హులు. జాతీయ స్థాయి అవార్డ్ లు ధరఖాస్తు చేసుకున్న వారు మరియు క్రమశిక్షనా చర్యలు పెండింగ్ లో వున్నవారు దరఖాస్తు చేయుటకు అనర్హులు.జిల్లా స్థాయి లో సంయుక్త కలెక్టర్ (అభివృద్ధి) చైర్మన్ గా జిల్లా విద్యాధికారి కన్వీనర్ గా డైట్ ప్రిన్సిపల్ .ఎక్జిఓ ప్రతినిది, ఒక జిల్లా అధికారి సభ్యులుగా ఎంపిక కమిటీ వుంటుంది అని జిల్లా విద్యాశాఖాధికారిఒక ప్రకటనలో తెలిపారు.