మాజీ కార్పొరేటర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్ఆర్ సిపి నాయకులు
1 min read

రాయి మంగరాజు మరణం కుటుంబ సభ్యులకు తీరని లోటు..
వైయస్సార్ సిపి ఏలూరు నియోజకవర్గం ఇంచార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : మాజీ కార్పొరేటర్ రాయి విమల దేవి,భర్త రాయి మంగరాజు గురువారం స్వర్గస్థులు అయినారు. మంగరాజు భౌతిక కాయన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి మామిళ్ళపల్లి జయప్రకాష్ (జెపి) సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన నగరంలో అందరితో కలుపుగోలుతనంగా ఉండేవారని, ఒక పెద్ద మనిషిలా వ్యవహరించే వారిని ఆయన నేడు మన మధ్య లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఆయన మరణం కుటుంబ సభ్యులకు తీరని లోటని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆయనతోపాటు నగర బీసీ సెల్ అధ్యక్షులు కిలాడి దుర్గారావు, రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గంట మోహన్ రావు,కొల్లిపాక సురేష్,రమేష్, బసవ, సత్యనారాయణ, శ్యాం స్థానిక నాయకులు నివాళులు అర్పించారు.


