NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చిన్న వెంకన్న ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ గా నూకల అమ్మాజీ నియామకం

1 min read

– దైవ సన్నిధిలో సేవ చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతం.. నూకల అమ్మాజీ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు జిల్లా ఏలూరు నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నూకల రామకృష్ణ ధర్మపత్ని అమ్మాజీ దానధర్మాల్లో చేయి తిరిగిన దాత శ్రీమతి నూకల అమ్మాజీ , ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ట్రస్ట్ బోర్డు కు డైరెక్టర్ గా ప్రభుత్వం చేత నియమించబడ్డారు. ఈ సందర్భంగా అమ్మాజీ మాట్లాడుతూ దైవభక్తి మానవ సేవ తమ కుటుంబలో నా భర్త నూకల రామకృష్ణ చేసిన సేవలకు గుర్తింపుగా నాకు దైవ సన్నిధిలో సేవ చేయటం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆదేశాలతో అదేవిధంగా దేవదాయ శాఖ మంత్రి శాఖ మంత్రి కొట్టుసత్యనారాయణకు, రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నానికి, అదేవిధంగా దెందులూరు శాసనసభ్యులు కొటారు అబ్బాయి చౌదరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అయితే దేవుని సన్నిధిలో మరింతగా తమ సేవలో విస్తరిస్తామని అమ్మాజీ తెలిపారు. గతంలో కోవిడ్ సమయంలో ఎంతోమందికి సహాయ సహకారాలు మరియు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. మానవసేవయే మాధవ సేవగా భావించి దైవచింతతో ఆ భగవంతునికి సేవ చేసుకునే రుణం,భాగ్యం కలగటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అన్నారు, అనేక దేవాలయాలకు, అయ్యప్ప భక్తులబిక్షకు ఆ భగవంతుడు మాకు కలుగజేసిన దానిలో తమ వంతు సహకారం మా కుటుంబ సభ్యుల సహకారంతో అందిస్తున్నానని అన్నారు. ఆ ఏడుకొండల వారి సన్నిధి సేవకు సేవ చేసుకోవడం మరింత బాధ్యతగా స్వామివారికి దర్శన నిమిత్తం వచ్చే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలతో తమ బాధ్యతతో సేవలందిస్తానని విలేకరులకు తెలిపారు.

About Author