కర్నూలు నగర తెలుగుయువత అధ్యక్షుడిగా పి.జయక్రిష్ణ నియామకం
1 min read
పల్లెవెలుగు వెబ్: కర్నూలు నగర తెలుగు యువత అధ్యక్షుడిగా పి.జయక్రిష్ణను నియమించారు టీడీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జ్ టి.జి భరత్. మంగళవారం నగరంలోని మౌర్య ఇన్ లో ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. నగర అధ్యక్షుడిగా తెలుగు యువతను ముందుండి నడిపించాలని చెప్పారు. పార్టీ కోసం కష్టపడి పని చేయాలన్నారు. బాధ్యతలు అప్పగించిన టి.జి భరత్ కు నగర తెలుగు యువత అధ్యక్షుడు పి. జయకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.