తాలిబన్ల పై సాయుధ పోరాటం.. కీలక నేతల చర్చలు !
1 min readపల్లెవెలుగు వెబ్ : ఆప్ఘన్ ను ఆక్రమించుకున్న తాలిబన్లపై తిరుగుబాటు బావుటా ఎగురుతోంది. దేశ ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాబూల్ నగరంతో పాటు దేశంలోని వివిధ ప్రావిన్సుల్లో ప్రజలు నిరసన బాట పట్టారు. మహిళలు కూడ ఆప్ఘాన్ జాతీయ పతాకాన్ని చేతబూని వీధుల్లోకి వచ్చారు. నంగర్హర్ లో నిరసనకారులపై తాలిబన్లు కాల్పులు జరిపారు. ఖోస్త్ లోనూ ఆందోళనకారులు పై తాలిబన్లు ఉక్కుపాదం మోపారు. ఆప్ఘన్ లోని పంజ్ షేర్ కేంద్రంగా తాలిబన్ల పై తిరుగుబాటుకు వ్యూహరచనలు సాగుతున్నాయి. పంజ్ షేర్ ప్రావిన్సు ఇంకా తాలిబన్ల ఆక్రమణలోకి రాలేదు. సాయుధ పోరాటం దిశగా పంజ్ షంజ్ షేర్లో చర్చలు జరుగుతున్నాయి. దేశ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ నేతృత్వంలో నార్తర్న్ కూటమి
పేరుతో సాయుధపోరాటం చేయాలని కీలక నేతలు చర్చిస్తున్నారు. అష్రాఫ్ ఘనీ దేశం విడిచిపారిపోవడంతో అమ్రుల్లా సలేహ్ తనను తాను ఆపద్ధర్మ అధ్యక్షుడుగా ప్రకటించుకున్నారు.