PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

1 min read

– పటిష్ట బందోబస్తు… మాల్ ప్రాక్టిస్ లేకుండా చూడాలి .. జిల్లా ఎస్పీ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఆధ్వర్యంలో జనవరి 22 వ తేది ఆదివారం పోలీసు కానిస్టేబుల్(సివిల్, ఎపిఎస్పీ) అభ్యర్ధులకు ప్రిలిమినరీ రాత పరీక్ష జరగబోతున్న సంధర్బంగా జిల్లా పోలీసు కార్యాలయానికి బందోబస్తు నిమిత్తం విచ్చేసిన పోలీసు అధికారులకు, సిబ్బంది కి కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ గారు శనివారం పలు సూచనలు, దిశా నిర్దేశాలు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించవలసిన విధి, విధానాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ గారు మాట్లాడారు. మాల్ ప్రాక్టీస్ లేకుండా చూడాలన్నారు. 200 మీటర్ల దూరంలో జిరాక్స్ సెంటర్లు లేకుండా చూసుకోవాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ లు పర్యవేక్షిస్తాయన్నారుజనవరి 22 వ తేదీన ఉదయం 10 నుండీ మధ్యాహ్నాం 1 గంట వరకు కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రిలిమినరి పరీక్ష ఉందన్నారు. అభ్యర్దులను పరీక్ష కేంద్రానికి ఉదయం 9 గంటల నుండే పరీక్ష హాలులోకి అనుమతిస్తారన్నారు. పరీక్ష కేంద్రంలోకి అభ్యర్ధులను అనుమతించే సమయంలో తనిఖీలు చేయాలన్నారు. హాల్ టికెట్ తో పాటు, బాల్ పెన్ను , ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్డు ఒకటి (ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లెసెన్సు లేదా పాస్ పోర్టు) ఉండే విధంగా చూడాలన్నారు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ (డిజిటల్) వాచ్ లు, ఇతర వస్తువులు పరీక్ష హాలుకు అనుమతించకూడదన్నారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా మొత్తం 48 పరీక్ష కేంద్రాలు ఉన్నాయన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన 22 వేల 630 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారన్నారు.( పురుష అభ్యర్థులు 18,117 , మహిళా అభ్యర్ధులు 4,513 ).పరీక్ష ముగిసేవరకు సిబ్బంది అందరూ పకడ్బందీగా విధులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డి. ప్రసాద్, రీజనల్ కో ఆర్డినేటర్ పుల్లా రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస రెడ్డి, డిఎస్పీలు వెంకట్రామయ్య, నాగభూషణం, శ్రీనివాసులు, కె.వి మహేష్, యుగంధర్ బాబు,దేవ కుమార్, రామ రావు, రాజ కుమార్, సిఐలు, ఆర్ఐలు, ఎస్సైలు ఉన్నారు.

About Author