PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు విస్తృతం కావాలి..

1 min read

ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగాలి..

ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు విస్తృతస్ధాయిలో అందించాలి

గిరిజన ప్రాంత గర్భిణీలకు  ప్రసవాలు చేయడంలో మరింత మెరుగైన వైద్యం అందించాలి

ఇంకా, ఏమైనా సదుపాయాలు అవసరమైతే ప్రతిపాధనలు చేయండి..

జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్.

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు విస్తృతస్ధాయిలో అందించాలని జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ వైద్యాధికారులను ఆదేశించారు.  శుక్రవారం కలెక్టరేట్ గౌతమీ సమావేశమందిరంలో జిల్లాలోని ఏరియా ఆసుపత్రులకు చెందిన  వైద్యాధికారులు, వైద్య విధానపరిషత్ సాంకేతిక నిపుణులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ వె. ప్రసన్నవెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలోను వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పధకం ద్వారా పేదప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారుప.  ప్రభుత్వ ఆసుపత్రులలోనే గర్భిణీస్త్రీల ప్రసవాలు జరగాలని దీనికి సంబంధించిన వైద్య సిబ్బంది విశేషమైన కృషి చేయాలనితద్వారా ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు మరింత నమ్మకం కల్పించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎంతోనిపుణులైన వైద్య సిబ్బంది ఉన్నారని ఆయన గుర్తుచేశారు.   నూజివీడు సిహెచ్ సిలో  ప్రసవాలలోను,  వైద్య సేవలు అందించడంలోను మెరుగైన ప్రగతి కనబడిందనని ఈ సందర్బంగా సిహెచ్ సి వైద్యాధికారి డా. ఆర్ ఎన్ సింగ్ ను ప్రత్యేకంగా అభినందించారు.  జిల్లాలో ప్రతి సిహెచ్ సిల్లో ఇదే విధంగా ప్రసవాల సంఖ్యను పెంచాలని అన్నారు.  జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన గిరిజనులు ఎక్కువమంది ప్రసవాలకు రావడం జరుగుతుందని ఈ ఆసుపత్రిలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పనకు చర్యలు తీసుకోవడం జరిగిందని ఇంకా ఏమైనా ఆసుపత్రికికావాల్సిన అవసరాలను గుర్తించి ప్రతిపాధనలు పంపిస్తే వాటిని కూడా మంజూరు చేయడానికి చర్యలుతీసుకుంటామని అన్నారు.  ఈ ఆసుపత్రిలో డెలివరీకి రెండు వారాలు ముందే ఆసుపత్రిలో జాయిన్ అవ్వడానికి వారికి అవసరమైన రూమ్ లను ఏర్పాటుచేయడానికి చర్యలుతీసుకుంటామని అన్నారు.  అలాగే ఆరోగ్యశ్రీ నిధులు వినియోగంపై వైద్యాధికారులను ఆరా తీశారు.  ప్రతి ఆసుపత్రుల్లోను మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం అన్ని విధాలా ఆరోగ్యశ్రీ ద్వారా నిధులు మంజూరు చేస్తున్నారని దీనిని ఆసుపత్రి సూపరింటెండెంట్ లు ఆసుపత్రి నిర్వహణకు సంబంధించి ప్రణాళికప్రకారంగా ఖర్చు చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రైవేటుఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వఆసుపత్రులలో ప్రజలకువైద్యం అందించడంలో వైద్యాధికారులు కృషి చేయాలన్నారు.   జిల్లాలోని ప్రతి సిహెచ్ సి సూపరింటెండెంట్ లతో కలెక్టర్ సమీక్ష చేశారు. సమావేశంలో డిసిహెచ్ఎస్ డా. బి. పాల్ సతీష్, జిజిహెచ్ సూపరింటెండెంట్ శశిధర్, నూజివీడు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆర్.ఎన్. సింగ్, ఎస్ఐడిసి పర్యవేక్షక ఇంజనీర్ బి. బలరాంరెడ్డి, వివిధ సిహెచ్ సి సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.

About Author