NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆరోగ్యశ్రీ సేవలను మరింత పటిష్టంగా అమలు చేయాలి

1 min read

– కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధనవంత్రి హాల్లో ఆరోగ్యశ్రీ మరియు ఈ హాస్పటల్ అన్ని విభాగాల హెచ్వోడీస్ లతో సమీక్ష సమావేశం

– ఆసుపత్రి సూపరింటెండెంట్,డా.V.వెంకటరంగా రెడ్డి,  మాట్లాడుతూ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధనవంత్రి హాల్ లో వివిధ విభాగాల HODs తో ఆరోగ్యశ్రీ మరియు ఈ హాస్పటల్ లపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.ఆసుపత్రిలోని పలు విభాగాలలో ప్రతి నెల ఇచ్చే టార్గెట్లను పూర్తయిన అనంతరం ఆరోగ్యశ్రీ సేవలను మరింత పటిష్టంగా అమలు చేయాలని సంబంధించిన హెచ్.ఓ డీ లను ఆదేశించారు.ఆసుపత్రిలోని పలు విభాగాలైన యూరాలజీ, మరియు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, విభాగాలకు ఈ హాస్పటల్ మంచి పర్ఫామెన్స్ చేసినందు కు అభినందనలు తెలియజేశారు.ఆసుపత్రిలోని సైరిక్స్  బయో మెడికల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆసుపత్రిలోని సైరిక్స్  బయో మెడికల్ వాళ్ల  పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం అన్ని విభాగాల  హెచ్వోడీల నుండి ఫిర్యాదుల మేరకు  వారిపై తీర్మానం చేసి డిఎంఈకి నివేదిక ఇవ్వనున్నట్లు తెలియజేశారు.ఆస్పత్రిలోని MRI మరియు CT స్కాన్ కేసులకు సంబంధించిన ఆయా విభాగాల హెచ్వోడిల ద్వారా  MRI మరియు CT స్కాన్ బ్రోచర్లపై సంతకం సంబంధించి హెచ్ఓడి సిగ్నేచర్ ఉండాలని యూనిట్ ఇంఛార్జి ది ఉండాలని Hodsకి ఆదేశించారు. ఆసుపత్రిలోని పేషెంట్స్ అవసరాలను బట్టి  సిటీ ఎమ్మారై స్కానింగ్ అడ్వైస్ చేయాలని సంబంధించిన విభాగాల Hods కి తెలియజేశారు.ఆసుపత్రిలోని సెక్యూరిటీ సిబ్బందిపై అగ్రహం వ్యక్తం చేశారు వాళ్ల పనితీరు మార్చుకోకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమానికి  కర్నూలు  వైద్య కళాశాల ప్రిన్సిపాల్, డా.సుధాకర్,  ఆసుపత్రి  డిప్యూటీ సూపరింటెండెంట్, డా.ప్రభాకర్ రెడ్డి, CSRMO డా.వెంకటేశ్వరరావు, ఆసుపత్రి డిప్యూటీ CSRMO డా.హేమనలిని, హెచ్వోడీస్, డా.హరి చరణ్, డా.శ్రీనివాసులు డా.సీతారామయ్య, డా. శ్రీలక్ష్మి బాయ్, RMO డా.వెంకటరమణ,  హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివబాల నగాంజన్, తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి, గారు తెలిపారు.

About Author