నీట్ యూజీ పరీక్ష నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేయండి
1 min read
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: మే 4వ తేదిన జరిగే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ ) యూజి పరీక్ష నిర్వహణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బస్టాండ్ సమీపంలో ఉన్న గవర్నమెంట్ హై స్కూల్, టేక్కే జూనియర్ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల తదితర కళాశాలల గదులను పరిశీలించారు. డీఈవో జనార్దన్ రెడ్డి, నీట్ అబ్జర్వర్ సత్యనారాయణ, ఆర్డీవో విశ్వనాధ్ తదితరులు కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ కళాశాలలోని గదులను పరిశీలిస్తూ మే నాలుగో తేదీన జరిగే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) యూజీ పరీక్ష నిర్వహణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను సూచించారు. జిల్లాలో దాదాపు 1,170 మంది విద్యార్థులు నీట్ పరీక్షలు రాస్తున్న నేపథ్యంలో పిల్లలకు ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చాలని కలెక్టర్ ఆదేశించారు. పరీక్షలు నిర్వహిస్తున్న ప్రతి కళాశాల లో డెస్క్ లు శుభ్రంగా ఉండడంతో పాటు ఒక్కో విద్యార్థికి ఒక్కో డెస్క్ కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా అవసరమైన విద్యుత్ తో పాటు, ఫ్యాన్లు కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో కూల్ వాటర్ ను తప్పనిసరిగా ఉంచాలన్నారు. బాలికలకు, బాలురులకు వేరువేరుగా టాయిలెట్లు ఉండాలని కలెక్టర్ సూచించారు. వికలాంగ అభ్యర్థులకు అనువైన పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు వీల్ చైర్లను కూడా అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో గోడ గడియారాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షలకు త్వరగా హాజరయ్యే విద్యార్థులకు బిస్కెట్స్ ఏర్పాటు చేసుకునేందుకు కూడా చర్యలు తీసుకోవాలన్నారు.