NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లంచ్ బాక్స్ లో బీఫ్ తీసుకెళ్లినందుకు అరెస్ట్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ల‌ంచ్ బాక్స్ లో బీఫ్ తీసుకెళ్లినందుకు ఓ స్కూల్ ప్ర‌ధానోపాధ్యాయురాలు అరెస్ట‌యింది. అస్సాం గోల్‌పరా జిల్లా లఖిపూర్‌లోని ముర్కాచుంగి మిడిల్‌ ఇంగ్లీష్‌ మీడియం ప్రధానోపాధ్యాయురాలు దలిమా నెస్సా బీఫ్ ను లంచ్‌ బాక్స్‌లో తీసుకెళ్లింది. అయితే తాను తెచ్చిన వంటకాన్ని తోటి ఉపాధ్యాయులకు పంచాలనుకుంది ఆమె. ఇది కొందరికి నచ్చలేదు. అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మే 14న స్కూల్‌లో జరిగిన ఓ పంక్షన్‌ సందర్భంగా ఇది జరిగింది. బీఫ్‌ను పంచాలనుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కొందరు టీచర్లు ఆమెపై స్కూల్‌ కమిటీకి ఫిర్యాదు చేశారు. అటుపై ఈ వ్యవహారం పోలీసులకు చేరడంతో ఆ ప్రధానోపాధ్యాయురాలిని అరెస్ట్‌ చేశారు. మంగళవారం ఆమెను అరెస్ట్‌ చేసి..ఆ మరుసటి రోజు కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో ఆమెకు జ్యూడిషియల్‌ కస్టడీ విధించారు.

                                                       

About Author