ఎన్సీబీ కార్యాలయానికి వచ్చిన ఆర్యన్ ఖాన్
1 min read
పల్లెవెలుగు వెబ్: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ తాజాగా ఎన్సీబీ (నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో) ఎదుట హాజరయ్యారు. ఇటీవల ముంబైలోని క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. చివరికి బాంబే హైకోర్టులో బెయిల్ లభించడంతో మూడు వారాల అనంతరం ఆర్యన్ ఖాన్ ఆర్థర్ జైలు నుంచి విడుదల అయ్యాడు. అయితే బెయిల్‌పై విడుదలైన ఆర్యన్‌కు కోర్టు పలు షరతులు విధించింది. ప్రతి శుక్రవారం ఎన్సీబీ కార్యాలయానికి వెళ్లాలని ఆదేశించింది. అందులో భాగంగానే ఆర్యన్ నేడు నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో ఎదుట హాజరయ్యాడు.