‘రెండు కోట్లు అడిగారు.. సాధ్యం కాదని చెప్పాను’..!
1 min readపల్లె వెలుగు వెబ్: మహారాష్ట్రలో రాజకీయాలు వేగంగా మలుపులు తిరుగుతున్నాయి. అవినీతి ఆరోపణలు వెల్లువలా వస్తున్నాయి. మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ మీద ఇటీవల మాజీ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ ఆరోపణలు చేశారు. ఆరోపణల నేపథ్యంలోనే అనిల్ దేశ్ ముఖ్ తన హోం మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే.. ముఖేష్ అంబాని వద్ద లభ్యమైన పేలుడు పదార్థాల కేసులో నిందితుడిగా ఉన్న సచిన్ వాజే.. మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ మీద ఆరోపణలు చేశారు. సస్పెండైన తనకు పదవి తిరిగి ఇవ్వడానికి రెండు కోట్ల లంచం అడిగారని ఆరోపించారు. తన వల్ల కాదని చెబితే.. కొద్ది కొద్దిగా ఇవ్వమన్నారని సచిన్ వాజే.. దేశ్ ముఖ్ మీద ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారంరేపుతున్నాయి. ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది.