సీఎం పై హత్యాయత్నం !
1 min readపల్లెవెలుగు వెబ్ : త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేబ్ పై హత్యాయత్నం జరిగింది. గురువారం ఈ ఘటన జరగ్గా.. శనివారం పోలీసులు విషయాన్ని బయటికి వెల్లడించారు. సాయంత్రం వాకింగ్ వెళ్లిన సమయంలో ఒక కారుతో బిప్లవ్ దేబ్ ను ఢీకొట్టడానికి ప్రయత్నించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ఈ ప్రమాదం నుంచి త్రిపుర సీఎం తృటిలో తప్పించుకున్నారు. హత్యాయత్నానికి పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. హత్యాయత్నానికి పాల్పడ్డ ముగ్గురు యువకుల వయసు 20 ఏళ్లు ఉంటుంది. హత్యయత్నానికి గల కారణాలు వెల్లడి కాలేదు. ఆ ముగ్గురు యువకులకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.