ఏలూరు నుండి విజయవాడ కి ఆస్ట్రా డీలక్స్ నాన్ స్టాప్ బస్సు
1 min read
కూటమి ప్రభుత్వ అధికారంలో 12 కొత్త సర్వీసుల్ని అందుబాటులోకి తెచ్చింది
ప్రారంభించిన ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ,
విజయవాడ జోన్-2 చైర్మన్ పెద్ద అప్పలనాయుడు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : నిరంతరం ప్రజా అవసరాలు తెలుసుకోవడంతో పాటూ, ప్రయాణీకులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా ఆర్టీసీ నూతన సర్వీసులను మరింతగా పెంచి సంస్థను అభివృద్ధిబాటలో పయనింపచేస్తున్నట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఏపిఎస్ ఆర్టీసి విజయవాడ జోన్-2 ఛైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. ఏలూరు కొత్తబస్టాండ్‌లో ఏలూరు నుండి విజయవాడకు నూతనంగా అందుబాటులోకి తీసుకువచ్చిన ఆల్ట్రా డీలక్స్ నాన్‌స్టాప్ సర్వీసు బస్సును బుధవారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి,ఏపిఎస్ ఆర్టీసి విజయవాడ జోన్ – 2 ఛైర్మన్ రెడ్డి అప్పలనాయుడులు జెండాఊపి ప్రారంభించారు. బస్సు లోపలి భాగాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 12 కొత్త సర్వీసుల్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. దీనిలో భాగంగానే అనేక కొత్త బస్సు సర్వీసులను ప్రారంభిస్తూ వస్తున్నామన్నారు. ముఖ్యంగా ప్రజల అభ్యర్ధన మేరకు కొత్తరూట్లలో సైతం బస్సు సర్వీసులు ప్రారంభించి, ప్రయాణీకులకు ఉపయుక్తంగా ఉండేలా సేవలందిస్తున్నట్లు చెప్పారు. ప్రజల కనీస అవసరాలపై ప్రత్యేక శ్రద్ధచూపుతూ కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందన్నారు. దానిలో భాగంగానే గత వైసిపి పాలనలో అస్తవ్యస్తంగా మారిన రహదారులకు మోక్షం కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతోందన్నారు. ఏపిఎస్ ఆర్టీసి విజయవాడ జోన్ – 2 రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ తాను ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జోన్ మొత్తం పర్యటిస్తూ సంస్థ అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు చెప్పారు. రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటూ నూతన బస్సు సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఏలూరు నుండి హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కూడా నూతన సర్వీసును అందుబాటులోకి తీసుకొస్తామని అప్పలనాయుడు వెల్లడించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ జి. మురళి,స్టేషన్ మేనేజర్ కుమారి, పిఆర్‌వో నరసింహం తదితరులు పాల్గొన్నారు.