NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో భారీగా ఉద్యోగావ‌కాశాలు.. రాష్ట్ర మంత్రి

1 min read

ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, ఏపీటీపీసీ కార్యాల‌యాలు ప్రారంభించిన మంత్రి

కర్నూలు, న్యూస్​ నేడు:  ఆంధ్రప్రదేశ్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేసేందుకు అపార అవ‌కాశాలు ఉన్నాయ‌ని రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ అన్నారు. మంగ‌ళగిరిలోని ఆటోన‌గ‌ర్‌లో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, ఏపీటీపీసీ కార్యాల‌యాల‌ను మంత్రి టి.జి భ‌ర‌త్ ప్రారంభించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ ఫుడ్ ప్రాసెసింగ్ రంగం ఎంతో కీల‌క‌మైంద‌న్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టార‌ని తెలిపారు. ఐదేళ్లలో రూ.30 వేల కోట్ల పెట్టుబ‌డులు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో తీసుకురావాల‌న్న ల‌క్ష్యంతో తాము ప‌నిచేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అన్ని రంగాల్లోక‌ల్లా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉద్యోగావ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని చెప్పారు. ఒక ప్రణాళిక ప్రకారం పెట్టుబ‌డులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామ‌న్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోష‌న‌ల్ కార్పొరేష‌న్‌ను గ‌త ప్రభుత్వం ప‌ట్టించుకోలేద‌న్నారు. త‌మ ప్రభుత్వం వ‌చ్చిన త‌ర్వాత ఒక్కొక్కటిగా సెట్ చేసుకుంటూ వెళుతున్నామ‌న్నారు. సీఎం చంద్రబాబు నాయుడు విజ‌న్‌కు అనుగుణంగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగం అభివృద్ధికి కృషి చేస్తున్న‌ట్లు మంత్రి టి.జి భ‌ర‌త్ తెలిపారు.

About Author