NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సింగిల్ డెస్క్ పోర్టల్ దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేయండి

1 min read

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించండి

పరిశ్రమలకు వివిధ రాయితీల కింద16 యూనిట్ లకు రూ. 31.85 లక్షలు మంజూరు

జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా

నంద్యాల, న్యూస్​ నేడు: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతి ప్రమోషన్ కమిటీ   సమావేశం జిల్లా కలెక్టర్ నిర్వహించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జిఎం జవహర్ బాబు, ఎల్డిఎం రవీందర్ కుమార్, ఎస్సీ, ఎస్టీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రాజమహేంద్రనాథ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుండి అందిన దరఖాస్తులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో గత త్రైమాస కాలంలో వివిధ పరిశ్రమల స్థాపనకు అనుమతులు కోరుతూ 65 దరఖాస్తులు అందగా సింగిల్ డిస్క్ విధానంలో ఆయా శాఖల ద్వారా 53 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పరిశీలనలో ఉన్న 12 దరఖాస్తులను నిర్ణీత కాల వ్యవధిలోగా తగిన పరిష్కారం అందించాలని పర్యావరణ,  ఫ్యాక్టరీస్ శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పరిశ్రమలకు అందజేయాల్సిన ప్రోత్సాహకాలకు సంబంధించి పెట్టుబడి రాయితీ, పావలా వడ్డీ విద్యుత్తు, సేల్ టాక్స్ తదితర రైతుల క్రింద జిల్లాలో ఉత్పాదన సేవా రంగంలోని 16 యూనిట్లకు 31.85 లక్షల విలువైన రాయితీ ప్రయోజనాలను కల్పిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా స్థాయి నుండి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో యువతకు పారిశ్రామిక పెట్టుబడులు, యూనిట్ల స్థాపణపై అవగాహన పెంపొందించాలన్నారు.ఈ సమావేశంలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ కిషోర్ రెడ్డి, రవాణాశాఖ అధికారి ఐశ్వర్య రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ పరిశ్రమల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

About Author