గంగానమ్మ ఆలయం వద్ద… మహ అన్నదానం
1 min readపల్లెవెలుగు, వెబ్ ఏలూరు : విశ్వశాంతి, లోక కల్యాణం కోసం ప్రతీ ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో జీవితం గడపాలని, దీని ద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని ఏలూరు నగరపాలకసంస్థ కో- ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. దేవి నవరాత్రులను పురస్కరించుకొని శుక్రవారం స్థానిక 16వ డివిజన్ కొబ్బరి తోట ప్రాంతంలోని గంగానమ్మ ఆలయం వద్ద ఫ్రెండ్స్ ఫరెవర్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన భక్తులకు స్వామివారి ప్రసాదం వడ్డించారు. ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ అన్నదానం అన్ని దానాల కన్న ఎంతో గొప్పదని, ఇటీవలి కాలంలో పండుగలు, పుణ్యకార్యాలు, ఇతర సందర్భాలను పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించడం ఆహ్వానించదగిన పరిణామమన్నారు. సమాజంలో తోటి వారి ఆకలి తీర్చడం గొప్ప పుణ్యకార్యక్రమమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జిజ్జువరపు విజయనిర్మల రమేష్, పిలగల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.