అవార్డుల బహుకరణ వేళ.. అరుదైన దృశ్యం
1 min read
పల్లెవెలుగువెబ్ : రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల బహూకరణ వేళ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. 125 ఏళ్ల యోగా గురువు స్వామి శివానంద అవార్డు తీసుకునే ముందు ప్రధాని నరేంద్ర మోదీకి పాదాభివందనం చేశారు. దీంతో స్వామి శివానందకు ప్రధాని ప్రతి నమస్కారం చేశారు. అవార్డు అందుకునే ముందు స్వామి శివానంద సభకు, రాష్ట్రపతికి కూడా పాదాభివందనం చేశారు. అవార్డు బహుకరించే ముందు రాష్ట్రపతి కోవింద్ ఆయన్ను ప్రేమతో పైకి లేపి వారించారు. మొత్తం 63 మందికి రాష్ట్రపతి కోవింద్ పద్మ అవార్డులు అందజేశారు.