PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పై దాడి హేయం..

1 min read

– దాడిని ఖండిస్తూ నందికొట్కూరు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా…
పల్లెవెలుగు, వెబ్​ నందికొట్కూరు: పత్తికొండ ఎబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పై దాడి చేయడం హేయమైన చర్య అని ఏపిడబ్యూజె గౌరవాధ్యక్షులు రామాంజనేయులు అన్నారు. దాడిని ఖండిస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు శనివారం నందికొట్కూరు జర్నలిస్టు లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ పత్తికొండ ఏబీఎన్ రిపోర్టర్ పక్కిరప్పపై ఎర్రమట్టి మాఫియా దాడి చేసిందన్నారు. పొలంలో ఆంజనేయస్వామికి పూజలు చేసి వస్తుండగా బైకులపై ముసుగులు వేసుకొని వచ్చిన నలుగురు వ్యక్తులు దాడి చేసి వెళ్లారన్నారు. స్థానికులు అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. నాలుగు రోజుల క్రితం ఎర్ర గరుసు అక్రమ తవ్వకాలపై వార్త ఏబీఎన్ లో ప్లే చేశారు.కక్షగట్టిన మట్టి మాఫియా ఈ దాడికి తెగబడిందన్నారు. ఇటీవల కాలంలో రిపోర్టర్స్ పై దాడులు పెరిగి పోతున్నాయన్నారు. పక్కిరప్ప పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కటినంగా శిక్షించాలని, జర్నలిస్టు రక్షణ కు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. నందికొట్కూరు ఆర్.ఐ. మురళికి వినతిపత్రం జర్నలిస్టులు సమర్పించారు.ఈకార్యక్రమంలో జర్నలిస్ట్ లు ప్రదీప్ కుమార్, సురేష్, వెంకటేష్, మల్లిఖార్జునుడు, నజీర్, గంగాధర్, జలీల్, నాగరాజు విజయ్ కుమార్​ లీల్, సోమన్న, గోపి , స్వాములు, విజయ్, నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.

About Author