PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి అప్రజాస్వామ్యకం!

1 min read

​​– కడప జిల్లా తెదేపా ఇన్​ఛార్ట్ విఎస్​.అమీర్​బాబు
= భౌతిక దాడులతో ప్రజలకు ఏం సంకేతం ఇస్తన్నట్లు
= రాష్ట్రంలో వైసీపీ ఆటవికత రాజ్యమేలుతోంది
= జగన్​ కోసమే ఎమ్మ్యెల్యే జోగిరమేష్​ బరితెంపు

పల్లెవెలుగువెబ్​ కడప : ఉండవెల్లిలోని మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఇంటి వద్ద స్థానిక ఎమ్మ్యెల్యే జోగిరమేష్​ తన అనుచరగణంతో దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కడప అసెంబ్లీ టిడిపి ఇన్​ఛార్జ్​ విఎస్​.అమీర్​బాబు అన్నారు. శుక్రవారం టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఇండిపై దాడి అప్రజాస్వామ్యకమని, భౌతిక దాడులతో సీఎం జగన్​ ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ ఆటవీక పాలన రాజ్యమేలుతోందని, సీఎం జగన్​ మెప్పు కోసమే ఎమ్మ్యెల్యే జోగిరమేష్​ చంద్రబాబు ఇంటి వద్ద బీభత్సం సృష్టించారని ఆరోపించారు. 14ఏళ్లు సీఎంగా పనిచేసిన జెడ్​కేటగిరి భద్రత ఉన్న చంద్రబాబుకే రక్షణ కొరవడితే.. ఇక సామాన్య ప్రజల మాటేంటని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాలు నిరసన చేపడితే టిడిపి నేతల ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలు చేస్తారు. జోగిరమేష్​ సోషల్​మీడియాలో చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని ప్రకటిస్తే డీజీపీ ఎందుకు ముందస్తు అరెస్టు చేయలేదని దుయ్యబట్టారు. నారాలోకేష్​ను నరసరావుపేటకు వెళ్లకుండా ఆపిన పోలీసులు జోగిరమేష్​కు చంద్రబాబు ఇంటికి వెళ్లేందుకు ఎలా అనుమతించారన్నారు. అల్లరిమూకలతో అలజడి సృష్ఠించిన వైసీపీ నేత జోగిరమేష్​పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్​ చేశారు. సమావేశంలో నగర అధ్యక్షులు సానపురెడ్డి శివకొండారెడ్డి, పార్లమెంట్​ అధికార ప్రతినిధి ఆమూరి బాలదాసు, కార్యదర్శి మాసా కోదండరామ్​, 15వ డివిజన్​ ఇన్​ఛార్జ్​ కొండా సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author