నాటు సారా స్థావరాలపై దాడులు..
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ కర్నూలు పరిధిలో బంగారుపేటలో నాటు సారా స్థావరాలపై దాడులు నిర్వహించడం జరిగినది నవోదయం కార్యక్రమంలో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రాము అవగాహన సదస్సులు మీటింగులు మరియు కళాజాత వంటి వాటి ద్వారా నాటుసారా నిర్మూలనపై అవగాహన కల్పించి తదుపరి వారిలో మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో కృషి చేయడం జరిగింది. అయినప్పటికీ కొంతమంది అదే దారిలో పయనించడం వల్ల దాడులు విస్తృతం చేయడం జరిగినది. కావున ఈరోజు బంగారు పేటలో సుమారు 600 లీటర్ల ఊట పది లీటర్ల నాటు సారాయి ధ్వంసం చేయడం జరిగినది . ఈ బెల్లం ఊట నీలి షికారి కాజల్ కు సంబంధించినదిగా గుర్తించడమైనది త్వరలో ఈమెను అరెస్టు చేయడం జరుగుతుంది కావున నాటు సారా స్థావరాలపై విస్తృతమైన దాడులు ఇక మీదట ఉంటాయి. కావున నాటుసారా తయారీ దారులు ప్రతి ఒక్కరు నాటసారాన్ని పూర్తిగా మానుకోవాలని తెలియజేయడం జరిగింది ఈ దాడులలో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ రెహనా మరియు సిబ్బంది రామలింగయ్య,సుదర్శన్ రాజు, రామచంద్రుడు మరియు ఇతరులు పాల్గొన్నారు.