NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్‌ఐఆర్ పేరుతో ఓటర్ల హక్కులను హరించే ప్రయత్నాలను తక్షణమే ఆపాలి

1 min read

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి

ఓటర్ల తొలగింపులపై పారదర్శక దర్యాప్తు పూర్తయ్యే వరకు ప్రక్రియను నిలిపివేయాలి: ఎస్‌డీపీఐ

హోళగుంద న్యూస్ నేడు: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ పేరుతో దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల్లో జరుగుతున్న మార్పులు, అర్హత కలిగిన ఓటర్ల పేర్ల తొలగింపుపై సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్లా ఖాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల హక్కులకు భంగం కలిగించే చర్యలను తక్షణమే నిలిపివేయాలని, ఓటర్ల తొలగింపులపై సమగ్రంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఎస్‌డీపీఐ తరఫున కోరారు.

ఎస్‌డీపీఐ రాష్ట్ర కార్యాలయంలో అబ్దుల్లా ఖాన్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో అనేక అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఎన్నికల సంఘంలోని ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పలు కీలక నిర్ణయాలపై అధికారికంగా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వచ్చిన నివేదికలను ఆయన ప్రస్తావించారు. ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, పునరుద్ధరణ, ఫారం-6లో మార్పులు వంటి అంశాలపై అభ్యంతరాలు వ్యక్తమైనట్లు తెలిపారు.వినిపించుకునేందుకు, అవసరమైన పత్రాలు సమర్పించేందుకు తగిన అవకాశం, సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఓటు హక్కు పరిరక్షణకు ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం

ఈ సందర్భంగా ఆలూరు తాలూకా ఎస్‌డీపీఐ అధ్యక్షుడు ఎఫ్. అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రతి అర్హత కలిగిన పౌరుడి ప్రజాస్వామ్య హక్కు అని అన్నారు. ఎస్‌ఐఆర్ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.ఓటర్ల జాబితాలో తమ పేర్ల తొలగింపుపై ఫిర్యాదులు చేసే వారికి తగిన అవకాశం కల్పించాలని, అర్హత ఉన్న వారి పేర్లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ప్రజలకు పూర్తి సమాచారం అందించాలని, ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాలని కోరారు.ఓటర్ల హక్కుల పరిరక్షణ కోసం ఎస్‌డీపీఐ ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం కొనసాగిస్తుందని ఎఫ్. అబ్దుల్ హమీద్ స్పష్టం చేశారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడి ఓటు హక్కు సురక్షితంగా ఉండేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.

About Author