NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం పై అవగాహన

1 min read

 సహాయం కోసం 181 మహిళా హెల్ప్‌లైన్ను సంప్రదించవచ్చని తెలియజేశారు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించి, మహిళలకు సురక్షితమైన, గౌరవప్రదమైన పని వాతావరణాన్ని కల్పించేందుకు పిఓఎస్ హెచ్ యాక్ట్  2013పై అవగాహన కార్యక్రమాన్ని ఏలూరులోని సుభం గ్రాండ్ షాపింగ్ మాల్‌లో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి & మిషన్ కోఆర్డినేటర్ పాల్గొని, POSH చట్టం ఉద్దేశ్యం, పని ప్రదేశంలో మహిళలకు కల్పించిన హక్కులు, లైంగిక వేధింపుల వివిధ రూపాలు, ఫిర్యాదు చేసే విధానం, అంతర్గత ఫిర్యాదుల కమిటీ బాధ్యతలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే, మహిళలు ఏదైనా ఇబ్బంది లేదా హింసకు గురైనప్పుడు సహాయం కోసం 181 మహిళా హెల్ప్‌లైన్ను సంప్రదించవచ్చని తెలియజేశారు.వన్ స్టాప్ సెంటర్ (OSC) సైకో-సోషల్ కౌన్సిలర్ నాగసుజి OSC ద్వారా అందించే కౌన్సెలింగ్, వైద్య, న్యాయ, పోలీసు సహాయం మరియు తాత్కాలిక ఆశ్రయం వంటి సేవల గురించి వివరించారు.పని ప్రదేశంలో మహిళల భద్రత, గౌరవం మరియు హక్కులను పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు.ఈ కార్యక్రమంలో సుభం గ్రాండ్ షాపింగ్ మాల్ మేనేజ్‌మెంట్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *