NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మానసిక ఆరోగ్య పై అవగాహన

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు సైకియాట్రిస్ట్ అసోసియేషన్, లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు మెల్విన్ జోన్స్,జిల్లా న్యాయసేవాధికారిక సంస్థ, అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా 117 సంయుక్త ఆధ్వర్యంలో లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అధ్యక్షతన మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమం, పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  కర్నూలు జిల్లా మానసిక వైద్యుల అసోసియేషన్  మానసిక వైద్య నిపుణులు డాక్టర్ చైతన్య కుమార్ నెల్లెల, ఆశా కిరణ్ ఆసుపత్రి మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కె. సుహృత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ చైతన్య కుమార్ నెల్లెల మాట్లాడుతూ మానసిక ఆరోగ్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమని, మానసిక సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన వైద్య సలహాలు, చికిత్స పొందాలని సూచించారు. డాక్టర్ కె. సుహృత్ రెడ్డి మాట్లాడుతూ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ప్రేమతో, గౌరవంతో చూడాలని, వారిపట్ల వివక్ష చూపకుండా కుటుంబ సభ్యులు, సమాజం అండగా నిలవాలని పేర్కొన్నారు. అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం పెంపొందిస్తాయని, సేవాభావంతో సంస్థలు కలిసి పనిచేయడం ద్వారా సమాజానికి మరింత మేలు చేయవచ్చని తెలిపారు.విశ్రాంత డిప్యూటీ కలెక్టర్, లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు మెల్విన్ జోన్స్ ఉపాధ్యక్షులు లయన్ గుర్రం త్రినాథ్ కుమార్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాల ద్వారా నిరుపేదలు, అనాథలు, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి సహాయం అందించడం సామాజిక బాధ్యత అని అన్నారు.  లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు మెల్విన్ జోన్స్ ఉపాధ్యక్షులు లయన్ కేడీజే బాబు మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అనే భావనతో అవసరమైన వారికి నిరంతరం సేవలు అందిస్తామని పేర్కొన్నారు. పుల్లారెడ్డి మానసిక దివ్యంగుల సేవా కేంద్రం  ఇన్‌చార్జి నాగమణి మాట్లాడుతూ కేంద్రంలోని వారికి ఆప్యాయత, పోషకాహారం, మానసిక మద్దతు అందించడం ఎంతో అవసరమని, ఇటువంటి కార్యక్రమాలు వారిలో ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. అనంతరం కేంద్రంలోని వారికి పండ్లు పంపిణీ చేసి, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని నిర్వాహకులు సూచించారు. కార్యక్రమంలో వైద్యులు, లయన్స్ క్లబ్ సభ్యులు, అలయన్స్ క్లబ్ ప్రతినిధులు, నిర్వాహకులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *