ఆన్లైన్ మోసాలపై అవగాహన ..అడిషనల్ ఎస్పీ రమణ..
1 min read– డ్రగ్స్ వినియోగం పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి..
పల్లెవెలుగు, వెబ్ పాణ్యం: బుధవారం నాడు నెరవాడ వద్ద ఉన్న ఆర్ జి యం ఇంజనీరింగ్ కాలేజ్ లో అడిషనల్ ఎస్పీ రమణ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పోలీస్‌శాఖ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన ద్వారా డ్రగ్స్ వినియోగంపై మరియు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కమిషనర్ సేబ్ నాగలక్ష్మి తో పాటు, నంద్యాల డి.ఎస్.పి మహేశ్వర రెడ్డి, పాణ్యం సర్కిల్ సీఐ వెంకటేశ్వరరావు, పాణ్యం ఎస్సై సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) రమణ మాట్లాడుతూ ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొబైల్ ఫోన హ్యాక్, క్రెడిట్ కార్డు సమాచారాన్ని చోరీ, ఓటీపీ మోసాలు, లోన్ యాప్, హానిట్రాప్, ఫిషింగ్ మెయిల్స్, సైబర్ దాడుల గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎక్కడైనా సైబర్ నేరాలు గురైనట్లయితే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930, డ్రగ్స్ టోల్ ఫ్రీ నెంబర్ 14550, సైబర్ మిత్ర వాట్సాప్ నెంబర్ 9121211100, సీఐడీ ఫ్యాక్ట్ ఫైండింగ్ వాట్సాప్ నెంబర్ 9071666667, నేషనల్ ఎమర్జెన్సీ నెంబర్ 112, పోలీస్ డయల్ 100 కు సమాచారం అందించాలన్నారు.జాయింట్ కమిషనర్ T. నాగ లక్ష్మీ మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం వలన యువత చెడిపోతున్నారు అని, ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు అని చెప్తూ, డ్రగ్స్ వాడకం, ట్రాన్స్పోర్టేషన్ కు కనిషం 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వరకు శిక్షలు ఉన్నాయని, డ్రగ్స్ జోలికి పోవద్దని హెచ్చరించారు. అనంతరం సిఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు ఆన్లైన్లో డ్రగ్స్ కొనుగోలు ఎక్కువైందని యువత చెడు దారి పట్టే అవకాశం ఉందని ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రుల ఆశయాల మేరకు ఉద్యోగాల సాధనకు కృషి చేయాలన్నారు మెరుగైన సమాజం కోసం యువత ముందుకు రావాలన్నారు. పోలీసులకు సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో ఆర్జిఎం కాలేజీ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు