అంగన్వాడీ సెంటర్లో బాల్య వివాహాలపై బాలికలకు అవగాహన కార్యక్రమం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు మండలం పి. రుద్రవరం గ్రామ పంచాయతీలో అంగన్వాడీ సెంటర్లో బాలికల దినోత్సవం సందర్భంగా సోమవారం గ్రామంలోని అంగన్వాడీ కార్యకర్తలు మరియు సచివాలయం మహిళా పోలీస్ ఆధ్వర్యంలో 18 సంవత్సరాల లోపు బాలికలకు వారి వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కల్పించడం జరిగింది. బాల్య వివాహ నిషేధ చట్టం 2006 ప్రకారం బాల్య వివాహాలు చట్టరిత్యా నేరం, బాల్య వివాహాలు చేయకూడదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చదువు ప్రాముఖ్యత గురించి మరియు బాల్య వివాహాల నష్టాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. బాల్యవివాహాలకు సంబంధించిన ప్రభుత్వ హెల్ప్ లైన్ నెంబర్ 1098 ను సంప్రదించవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలికలకు వీటిపై వ్యాసరచన డ్రాయింగ్ మరియు ఆటల పోటీలు నిర్వహించి గెలిచిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది. ‘‘బాల్య వివాహాలను అడ్డుకుందాం బంగారు సమాజాన్ని నిర్మిద్దాం”. ఈ కార్యక్రమంలో ఆర్. మాధవి ఏడబ్ల్యూసి టీచర్, బి .నాగ శేషమ్మ ఏడబ్ల్యూసి , వసుందరమ్మ ఏడబ్ల్యూసి, వి. వెంకట సుబ్బమ్మ ఏడబ్ల్యూసి, ఏ. శివమ్మ మహిళా పోలీస్ తదితరులు పాల్గొన్నారు.

