శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమం
1 min read

ఈ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందిస్తే క్షణాల్లో సహాయం అందిస్తాం
త్రీ టౌన్ సిఐ కోటేశ్వరరావు
విద్యార్థుల మహిళల భద్రతే మా లక్ష్యం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు నగరంలోని వట్లూరు బీసీ వెల్ఫేర్ వసతి గృహం లోని విద్యార్థులకు మహిళల భద్రతపై 3 టౌన్ సీఐ కోటేశ్వరరావు సోమవారం ఉదయం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలికల విద్యార్థుల మహిళల భద్రత మా లక్ష్యం అని అన్నారు.శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయాల్లో ఈ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందిస్తే క్షణాల్లో సహాయం అందిస్తారని ఆయన వారికి తెలిపారు. మేము ఉన్నామని విద్యార్థులకు భరోసా కల్పించారు.

