NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఈ రహదారి వెంట వెళ్లాలంటే నరకయాతన..

1 min read

హొళగుంద న్యూస్ నేడు : హొళగుంద ఢణాపురం ప్రధాన రహదారి సరణానికి సరకుగా మారింది. దీంతో పల్లెవాసులు రోడ్డుపై వెళ్లాలంటేనే హడలిపోతున్నారు. ఇక వర్షాలు పడితే ఈ రోడ్డుపై ద్విచక్ర వాహనాలు సైతం వెళ్లడానికి వీలులే కుండా పోయిందని దారి వెంట వెళ్ళే ప్రయాణికులు అంటున్నారు. గతంలో కురిసిన భారీ వర్నాలకు ఈ రోడ్లు పూర్తిగా దెబ్బ తింది. గత 20 సంవత్సరాల నుండి ఉన్న ప్రభుత్వాలు రోడ్లకు కనీసం మరమ్మతులు సైతం చేపట్టక పోవడంతో అవి మరింతగా గోతులు ఏర్పడి వాహనచోదకులు ఈ రోడ్డులో ప్రయాణించాలంటే అష్టకష్టాలు పడుతున్నారని వారు తెలిపారు. కొద్దిపాటి వరం సురిసిందంటే ద్విచక్రవాహన దారులు ఈ రోడ్డులో కిందపడి గాయాల పాలవుతున్నారు. అంతేకాకుండా గత పాలకులు ఈ రహదారిపై రోడ్డు నిర్మించలేదంటూ ప్రస్తుత పాలకులు కూడా. గత పాలక పాలకులు చేసే తప్పిదాన్నే చేస్తున్నారని వీరి మాటల మధ్య సామాన్య ప్రజలు ఈ రహదారి వెంట వెళ్లాలంటే నరకయాతన పడుతూ అవస్థలు పడుతున్నారని వారు ఎద్దేవ చేశారు. అంతేకాకుండా ఈ రహదారి నిర్మాణం కోసం గతంలో పలు ప్రజాసంఘాల నాయకులు జేపసీగా ఏర్పడి ఉద్యమాలు చేశారని, ఏం చేసినా కూడా సమస్య మాత్రం ఓ వీడని గ్రహణంచా మారిందని ఈ రహదారికి ఈగ్రహణం ఎప్పుడు వీడుతోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఈ రహదారి అవస్థతో ప్రస్తుతం ఈరహణాని వెంట ఉండే గ్రామాలు నాగవాతనహళ్లి, హెబ్బటం, లింగదవాళ్లి, వండవాగిలి, తదితర గ్రామాలలో విద్య వైద్యంతో పాటు రైతన్నలు పండించిన వంటల ఎగుమతి దిగుమతి కూడా ఆందోళనకరంగా మారిందని వారు అభిప్రాయపడ్డారు.రహదారి నిర్మాణం లేక విద్యభ్యాసానికి దూరమైన విద్యార్థులు: రహదారి నిర్మాణం లేకపోవడంతో పలు గ్రామాల విద్యార్థులు తమ విద్యాభ్యాసాన్ని మధ్యలోనే ఆపి పొలం పసులకు వెళ్లాల్ని వస్తుందని ఆయా గ్రామాలలో మధ్యలో మానేసిన విద్యార్థులు అవేదన చెండుతున్నారు. ఎందుకంటే తమ గ్రామంలో ఎక్కడిదాకా విద్య అందుతుందో అర్కుడిపోరా చదువుకొని ఉన్నత చదువుకు ఆదోని పట్టణానికి వెళ్లి చదవాలంటే రవాణా వ్యవస్థ, బస్సు వ్యవస్థ లేక చేసేదేమీ లేకమధ్యలోనేలేకమధ్యలోనమానేస్తున్నారు. నిర్ణీత సమయంలో వైద్య మందర గాల్లో కలుస్తున్న ప్రాణాలు: ఈ రహదారి నిర్మాణం లేకపోవడం వల్ల పలు సమయాలలో గర్భిణీ స్త్రీలు నిర్ణీత సమయంలో వైద్యమందక ఎన్నోసార్లు ఇబ్బంది పడుతూ, ప్రాణాలు పోయిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.

About Author