BRICS సుస్థిర జీవనశైలి వారోత్సవాలపై అవగాహన కార్యక్రమాలు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: గౌరవనీయులైన చైర్మన్ , మెంబర్ సెక్రటరీ మరియు జిల్లా యంత్రాంగం వారి ఆదేశాల మేరకు, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయం, కర్నూలు ఆధ్వర్యంలో కర్నూలు మరియు నంద్యాల జిల్లాల వ్యాప్తంగా BRICS సుస్థిర జీవనశైలి వారోత్సవాల పై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది.ఇందులో భాగంగా, “ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోండి (Adapt Healthy Lifestyle)” అనే అంశం కింద, నేడు నంద్యాల జిల్లా, ప్యాపిలి మండలం, సిరిపురం లోని మెస్సర్స్ రెయిన్ సిమెంట్స్, యూనిట్-II వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమం క్రింది విధంగా నిర్వహించబడింది:
1. యోగా కార్యక్రమం: సుస్థిర మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా ఉద్యోగులు మరియు పాల్గొనేవారికి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు యోగా కార్యక్రమం నిర్వహించారు.2. లైఫ్ (LiFE) ప్రతిజ్ఞ: పర్యావరణ అనుకూల అలవాట్లను నిత్య జీవితంలో పాటిస్తామని, వనరులను పరిరక్షిస్తామని పాల్గొన్న వారందరితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.3. సైకిల్ ర్యాలీ: వాయు కాలుష్యం మరియు కర్బన ఉద్గారాలను తగ్గించడం, కాలుష్య రహిత రవాణాను ప్రోత్సహించడం లక్ష్యంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు.4. మొక్కలు నాటే కార్యక్రమం: పచ్చదనం పెంపు మరియు కర్బన తటస్థతను ప్రోత్సహించేందుకు ఫ్యాక్టరీ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, మెస్సర్స్ రెయిన్ సిమెంట్స్ యాజమాన్యం, సిబ్బంది మరియు ఇతర ప్రతినిధులు చురుకుగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన రెయిన్ సిమెంట్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు.BRICS సుస్థిర జీవనశైలి వారోత్సవాల సందర్భంగా పరిశ్రమలు, విద్యా సంస్థలు మరియు బహిరంగ ప్రదేశాలలో సుస్థిర జీవనం మరియు పర్యావరణ పరిరక్షణపై ఇటువంటి అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తామని ప్రాంతీయ కార్యాలయం తెలియజేసింది.


