NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు

1 min read

అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసు

కర్నూలు,న్యూస్​ నేడు:  సోమవారం కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించేందుకు అన్ని విధాలా పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేశామని అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. సోమవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో కౌంటింగ్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలోని 68 వార్డుల పరిధిలో 487 పోలింగ్ కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో 2,58,035 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, మొత్తం 53.77 శాతం పోలింగ్ నమోదైందన్నారు.ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్సులను అథెనా స్కూల్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో భద్రపరిచామని, స్ట్రాంగ్ రూం వద్ద నిరంతర నిఘా కోసం సీసీ కెమెరాలతో పాటు రెండు అంచెల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.మంగళవారం ఉదయం 8 గంటలకు అథెనా స్కూల్‌ ప్రాంగణంలోని స్పోర్ట్స్ బిల్డింగ్‌ (ఇండోర్ స్టేడియం) లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని, మేయర్ స్థానానికి మొత్తం 13 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని పేర్కొన్నారు. మేయర్ స్థానానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు కోసం 73 టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి టేబుల్ వద్ద అభ్యర్థుల తరఫున ఒక్కో ఏజెంట్‌కు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి కౌంటింగ్ టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్‌తో పాటు నలుగురు సహాయక సిబ్బందిని నియమించామని, వీరితో పాటు అదనపు సిబ్బందిని కలిపి మొత్తం 1,000 మందిని ఓట్ల లెక్కింపు విధులకు నియమించినట్లు కమిషనర్ చల్లా ఓబులేసు వివరించారు.కార్యక్రమంలో మేయర్ స్థాన రిటర్నింగ్ అధికారి, సెట్కూరు సిఈఓ డాక్టర్ వేణుగోపాల్, అదనపు కమిషనర్ ఆర్‌జి‌వి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *