పల్లెవెలుగు వెబ్: అజాత శత్రువు…సీనియర్ జర్నలిస్ట్… ఏపీజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, పల్లెవెలుగు దినపత్రిక యాజమాని కీ.శే.శ్రీ మద్రి కృపావరం…. జర్నలిస్టుల మదిలో చిరస్మరణీయమన్నారు పాత్రికేయులు. ఏపీజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా జర్నలిస్టులకు విశేష సేవలు అందించిన కృపావరం… మృతి చెంది రెండేళ్లు (18.12.20) అవుతోంది. సోమవారం పల్లెవెలుగు దినపత్రిక జిల్లా కార్యాలయంలో ఆయన తనయుడు స్వరూప్ కుమార్ కీ.శే. కృపావరం చిత్రపటానికి పూలమాల వేసి ఘననివాళి అర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు గడివేముల మహబూబ్బాష, పత్తికొండ గోపాల్, ఆళ్లగడ్డ ఈరన్న, బనగానపల్లె మహబూబ్బాష మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో జర్నలిస్టులకు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. కర్నూలు నగరంలోని జగన్నాథగట్టుపైన దాదాపు 250 మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. అంతేకాక ఉమ్మడి జిల్లాలోని అనేక పత్రికలో పనిచేసే విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇప్పించాడని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా… దగ్గరుండి పరిష్కరించిన ఆయన… పోరాటం అజరామరం అన్నారు. కృపావరం ఆశయ సాధనకు ప్రతి జర్నలిస్టు కృషి చేయాలని ఈ సందర్భంగా మహబూబ్బాష, ఈరన్న, గోపాల్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు తిరుమలేష్, నంద్యాల బోధన చంద్రశేఖర్, ఉరుకుందు, నందికొట్కూరు ఖాజాహుసేన్, జయరాజు, వెలుగోడు రాముడు, ఆస్పరి రూబెన్, డోన్ శివకుమార్, ప్యాపిలి వెంకటకృష్ణ, ఆత్మకూరు వహిద్, ప్యాపిలి వెంకట కృష్ణ, కల్లూరు రవికుమార్, గోనెగండ్ల కరుణాకర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.