NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గేజ్జహల్లిలో బాబు సాబ్ మనవడు వివాహ వేడుక ఘనంగా

1 min read

వధూవరులను ఆశీర్వదించిన టిడిపి మండల ప్రధాన కార్యదర్శి ఈ.బి.జి. గోవింద్ గౌడ్

హోళగుందన్యూస్ నేడు; హోళగుంద మండలం గేజ్జహల్లి గ్రామంలో సీనియర్ నాయకులు బాబు సాబ్ మనవడు వివాహ వేడుక అత్యంత ఘనంగా, ఆనందోత్సవాల నడుమ నిర్వహించబడింది. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ శుభ సందర్భంగా టిడిపి మండల ప్రధాన కార్యదర్శి ఈ.బి.జి. గోవింద్ గౌడ్ ప్రత్యేకంగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన దంపతులు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్య సంపదలతో ఆనందభరితమైన దాంపత్య జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.వివాహ వేడుకలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వేడుక మొత్తం హర్షాతిరేక వాతావరణంలో సాగింది.

About Author