NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజా సమస్యల పరిష్కార వేదిక

1 min read

ప్రజల సమస్యలను పారదర్శకంగా పరిష్కరించడమే లక్ష్యం

జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గల హచ్ జె దొర కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన ప్రజల సమస్య ల పరిష్కారం ఏలూరు జిల్లా పోలీస్ కార్యాల యంలో పబ్లిక్ గ్రీవెన్స్ ను ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్  ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. ప్రజల యొక్క సమస్యలను త్వరి తగతిన, పార దర్శకంగా పరిష్క రించడమే లక్ష్యంగా ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజల సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్, ఏఆర్ అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్. సూర్య చంద్ర రావు ఏ ఆర్ అదనపు ఎస్పీ శ్రీ జి ముని రాజా తో కలిసి ఫిర్యాదుదారుల నుండి నేరుగా అర్జీలను స్వీకరించారు.ఈ కార్యక్రమం పూర్తిగా పేపర్ లెస్  పద్ధతిలో, పారదర్శ కమైన ఆన్‌లైన్ విధానంలో నిర్వహిం చినారు. మొత్తం 41 ఫిర్యాదు లు అందాయి. వీటిలో ప్రధానంగా భూ వివాదాలు, కుటుంబ తగాదాలు మరియు ఆర్థిక మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయన్నరు. ఎస్పీ  స్వయంగా ఫిర్యాదు దారులతో మాట్లాడి, వారి సమస్యలను విన్నారు. సదరు ఫిర్యాదులపై చట్టప్రకారం తక్షణమే విచారణ చేపట్టి, నివేదికలను సమర్పించాలని సంబంధిత అధికారు లకు కఠిన ఆదేశాలు జారీ చేశారు.ప్రజలు తమ సమస్యల కోసం జిల్లా కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా మరిన్ని వెసులుబాటులను ఎస్పీ  వివరించారు.డబ్బు, సమయం వృథా చేసుకోకుండా నేరుగా సమీపంలోని సబ్-డివిజన్ లేదా సర్కిల్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేయవచ్చుని తెలిపారు.ఫిర్యాదులు చేయాలనుకునే వారు meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవచ్చుఅన్నారు.ప్రజలు చేసిన ఫిర్యాదుల స్థితిగతు లను  తెలుసు కోవడానికి 1100 టోల్-ఫ్రీ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు.పబ్లిక్ గ్రీవెన్స్ కార్య క్రమమునకు వచ్చినా దూర ప్రాంతాల నుండి ఫిర్యాదుల కోసం పోలీస్ కార్యాలయానికి వచ్చిన ప్రజల కోసం శ్రీ సత్య సాయి బాబా ట్రస్ట్ వారు ఉచిత భోజన సదుపాయం కల్పించారు.

About Author