కర్నూలులో దారుణం !
1 min readపల్లెవెలుగువెబ్ : మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధిస్తూ, ఆ బాలికపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఈఘటన కర్నూల్ జిల్లా తుగ్గలి మండల పరిధిలోని ఎద్దుల దొడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కధనం ప్రకారం ఎద్దుల దొడ్డి గ్రామానికి చెందిన తలారి సూరి అనే యువకుడు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించేవాడు. తనను ప్రేమించలేదని బాలికపై కక్ష కట్టాడు. సోమవారం బాలిక తమ ఇంట్లో ఒంటరిగా ఉందని తెలుసుకున్న తలారి సూరి.. తనను ప్రేమించాలని పట్టుపట్టాడు. బాలిక ఒప్పుకోకపోవడంతో బాలిక నోట్లో బట్టలు కుక్కి, గొంతు నులిమి హత్య చేయబోతుండగా ఆ బాలిక కేకలు వేసింది. దీంతో పొరుగింటి వారు వచ్చి బాలికను రక్షించారు. యువకుడు తలారి సూరి అక్కడి నుండి పారిపోయాడు. తరువాత బాలికతో పాటు వారి తల్లిదండ్రులు తుగ్గలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తుగ్గలి ఎస్ఐ మల్లికార్జున కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.