దుర్వాసన చదువులు….
1 min read
పాఠశాల ముందే మురుగు నీరు నిల్వ
దుర్వాసన తో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
పట్టించుకోని అధికారులు
మంత్రాలయం న్యూస్ నేడు : మండల పరిధిలోని మాధవరం గ్రామంలో బిసి మండల ప్రాథమిక పాఠశాల లో విద్యార్థులు దుర్వాసన తో చదువులు కొనసాగిస్తున్నారు. ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు దుర్వాసన రావడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల ముందే మురుగు కాలువలలో నీరు నిల్వ ఉండి దుర్వాసన తో అల్లాడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మురుగు నీరు నిల్వ ఉండడంతో ఇక్కడ పట్టపగలే దోమల బెడద ఎక్కువగా ఉంటుందని విద్యార్థులు వాపోతున్నారు. దోమలు కుట్టడం వల్ల జ్వరాల బారిన పడి అనారోగ్యంతో బాధపడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. పంచాయతీ అధికారులు కానీ, విద్య శాఖ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
