PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘బడుగు’లను హిందూ సమాజం అక్కున చేర్చుకోవాలి

1 min read

వీహెచ్​పీ ఏపీ సంఘటనా మంత్రి శ్రీనివాసరెడ్డి

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: బడుగు బలహీన వర్గాల వారిని అంటరాని వారిగా చూసే నీచ జాడ్యాన్ని  రూపుమాపాలన్న సదుద్దేశంతో నిరాధరణ పాలై ధర్మాన్ని విడిచిపెడుతున్న సోదరులను హిందూ సమాజం అక్కున చేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు విశ్వహిందూ పరిషత్​ సంఘటనా మంత్రి శ్రీనివాస రెడ్డి.  కులాల మధ్య అంతరాలను తొలగించి… సోదర భావాన్ని పెంపొందించాలన్న ధ్యేయంతో కులాలపై అవగాహన కార్యక్రమాలను గ్రామాలలో విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అనంతరం  రాష్ట్ర సహకార్యదర్శి ప్రాణేష్ మాట్లాడుతూ హిందూ సమాజంలో కులాల ప్రాధాన్యం అత్యంత విలువైనదనీ, హిందూ సమాజానికి ఆలంబన కులాలేననీ,ఇన్ని కులాలూ,సంప్రదాయాలు ఉన్న ఈ సమాజం అన్ని కులాలవారు,వారి,వారి సంప్రదాయాలను పాటిస్తూ,కట్టుబాట్లను ఆచరిస్తూ ఇతర కులాల వారితో కలిసిమెలిసి జీవించే అధ్భుతమైన చరిత్ర భారతీయ హిందూ సమాజానిదన్నారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ధర్మప్రసార్ కన్వీనర్ ఏ.వీ.ప్రసాద్,విభాగ్ కార్యదర్శి సుబ్రహ్మణ్యం, బజరంగ్దళ్ కన్వీనర్ నీలి నరసింహ, జిల్లా కార్యదర్శి విజయుడు,సామాజిక సమరసత కన్వీనర్ మాకం నాగరాజు,సత్సంఘ కన్వీనర్ మాళిగి భాను ప్రకాష్,జిల్లా సహకార్యదర్శి శివప్రసాద్,నగర కార్యాధ్యక్షులు గోరంట్ల రమణ,నగర కోశాధికారి ఈపూరి నాగరాజు,రెడ్డి,నాయీ బ్రాహ్మణ,బ్రాహ్మణ,జంగమ మహేశ్వర,వీరశైవ లింగాయితి, మేదరి ,వైశ్య, యాదవ, భావసార క్షత్రియ,మరియూ ఇతర కులసంఘాల నాయకులూ పాల్గొన్నారు.

About Author