NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

న్యాయ వాదులకు న్యాయ వృత్తి పై అవగాహన సదస్సు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ” గురువారం కర్నూలు,న్యాయ సేవా సదన్ నందు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా  వెంకట శేషాద్రి మరియు కర్నూలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రుడు ఆధ్వర్యంలో   న్యాయవాదులకు ఏర్పాటుచేసిన సెమినార్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి ఏ. హరిహరనాథ శర్మ హాజరయ్యారు. హైకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ కోర్ట్ లలో డిజిటల్ ఫైలింగ్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల విచారణ వేగ వంతం చేయవచ్చు నని తెలిపారు. అలాగే లోక్ అదాలత్, మధ్యవర్తిత్వం,  రాజీ ద్వారా కేసులు త్యరగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ప్రతి కేసు కు టైం లైన్ ఏర్పాటు చేసుకొని త్వరగా కేసులను పూర్తి చేయాలని కోరారు. న్యాయవాది కోర్టులో చట్టం ప్రకారం ఏది సరైనదో క్లెయింట్లకు వివరించాలన్నారు. నిజాన్ని వెలికి తీయడంలో కోర్టుకు సహకరించాలని తెలిపారు. పేదలకు, సమాజానికి సంబంధించిన కేసులను ఉచితంగా వాదించాలని కోరారు.సకాలంలో న్యాయం అందాలంటే న్యాయవాదులు సాంకేతకను అందిపుచ్చుకోవాలని కోరారు. న్యాయవాద వృత్తిలో రాణించాలనుకునే వారికి అనేక రకాల ఉపాధి కల్పనలు కలవని తెలిపారు.  అనంతరం జూనియర్ న్యాయవాదులు అడిగిన సమస్యలకు పరిష్కార మార్గాలను తెలియజేశారు. కర్నూలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైకోర్టు జడ్జిని ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, కార్యదర్శి,బి. లీలా వెంకట శేషాద్రి, కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రుడు,  జనరల్ సెక్రటరీ మహేశ్వర్ రెడ్డి మహేశ్వర రెడ్డి , లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ శివ రామ చంద్ర రావు, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సులోచన, సీనియర్ న్యాయ వాదులు, జూనియర్ న్యాయ వాదులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *