వసుంధరదేవికి `ఐలవ్ యూ` చెప్పిన బాలకృష్ణ !
1 min readపల్లెవెలుగువెబ్ : ప‌్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా ప్రసారమవుతున్న షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే
. ఈ షో ఆహాలో ప్రసారమవుతోంది. ఈ షోకు అతిథిగా ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా హాజరయ్యారు. ఈ క్రమంలోనే ‘మీరెప్పుడైనా వసుంధరగారికి ఐ లవ్ యు అని చెప్పారా’ అని అడగ్గా ‘నీకెందుకయ్యా’ అంటూ బాలకృష్ణ నవ్వులు పంచారు. ఆ తర్వాత తన శ్రీమతికి ఫోన్ చేశారు. ‘వసూ.. ఐ లవ్ యు’ అని బాలకృష్ణ తన ప్రేమను వ్యక్తం చేయగా ‘నాకు తెలుసు మీరెప్పుడూ నన్ను ప్రేమిస్తూనే ఉంటారు’ అంటూ వసుంధర సమాధానమిచ్చారు. దీంతో షో మొత్తం నవ్వులు వెల్లివిరిసాయి.