NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పునీత్ పార్థివదేహం వ‌ద్ద బాలయ్య కంటత‌డి

1 min read

పల్లెవెలుగు వెబ్​ : పునీత్ రాజ్ కుమార్ మ‌ర‌ణ‌వార్తతో నంద‌మూరి బాల‌కృష్ణ దిగ్భ్రాంతికి గురయ్యారు. బెంగ‌ళూరుకు చేరుకుని పునీత్ పార్థివ దేహానికి నివాళి అర్పించారు. శ‌నివారం ఉద‌యం కంఠీర‌వ స్టేడియానికి చేరుకున్న బాల‌కృష్ణ.. పునీత్ పార్థివ‌దేహం చూసి కంట‌త‌డిపెట్టారు. అనంత‌రం పునీత్ రాజ్ కుమార్ సోద‌రుడు శివ‌రాజ్ కుమార్ ను ప‌రామ‌ర్శించారు. పునీత్ మ‌ర‌ణం వ్యక్తిగ‌తంగా త‌న‌కు తీర‌నిలోటు అని బాల‌య్య అన్నారు. పునీత్ లేడ‌న్న విష‌యం న‌మ్మలేక‌పోతున్నాన‌ని చెప్పారు. ఒక‌త‌ల్లి క‌డుపున పుట్టక‌పోయినా అన్నద‌మ్ముల్లా క‌లిసిమెలిసి ఉండేవాళ్లమ‌ని అన్నారు. ఎన్టీఆర్ సినిమా ప్రమోష‌న్స్ కు కూడ పునీత్ వ‌చ్చార‌ని గుర్తు చేసుకున్నారు. ఒక కళాకారుడిగా, మంచి మ‌నిషిగా మ‌నంద‌రి గుండెల్లో ఎప్పటికీ పునీత్ ఉంటార‌ని అన్నారు.

About Author