బనగానపల్లె ఎమ్మెల్యే కాటసానికి మాతృవియోగం
1 min read– స్వగ్రామం గుండ్లసింగవరంలో ముగిసిన అంత్యక్రియలు
– పాడెమోసి మాతృమూర్తి రుణం తీర్చుకున్న బనగానపల్లె, పాణ్యం ఎమ్మెల్యేలు కాటసాని బ్రదర్స్
– ప్రముఖుల సంతాపం
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి శ్రీమతి పుల్లమ్మ (90) అనారోగ్య కారణంగా కర్నూలులోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం రాత్రి చనిపోయారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. వయసు ఎక్కువ కావడంతో కోలుకోలేకపోయారు. గత రాత్రి 11 గంటల సమయంలో మృతి చెందారు. ఆమె మృతితో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఆయన సతీమణి శ్రీమతి కాటసాని జయమ్మ, కుమారుడు కాటసానిఓబులరెడ్డిలుశోకసంద్రంలో మునిగిపోయారు.కి.శే పుల్లమ్మ మృతదేహాన్ని బుధవారం ఉదయం కర్నూలు నుంచి నేరుగా తమ స్వగ్రామమైన అవుకు మండలం గుండ్లసింగవరంలో తీసుకవెళ్లి అక్కడే గ్రామశివారులోని స్మశాన వాటికలో సాయంత్రం 5 గంటలకు దహణసంస్కారాలు చేశారు. అంత్యక్రియల్లో స్మశానవాటికవరకు పాణ్యం, బనగానపల్లె ఎమ్మెల్యేలు కాటసాని రామభూపాలరెడ్డి, కాటసాని రామిరెడ్డిలు తామే స్వయంగా పాడే మోసి తమ మాతృమూర్తి రుణం తీర్చుకున్నారు. అంతకు ముందు ఆమె మృతదేహాన్ని గుండ్లసింగవరంలోని కాటసాని రామిరెడ్డి ఇంటిముందు ప్రజల సందర్శనార్థం ఉంచారు. స్వర్గీయ శ్రీమతి పుల్లమ్మ మృతితో కాటసాని కుటుంబీకులు పాణ్యం ఎమ్మెల్యే , టీటీడీ పాలకమండలి సభ్యుడు కాటసాని రామభూపాలరెడ్డి,ఆయన సతీమణి కాటసాని ఉమామహేశ్వరమ్మ, వారి తనయుడు కాటసాని శివనరసింహరెడ్డి, వైకాపా బనగానపల్లె , అవుకు మండల ఇంచార్జ్ లు కాటసాని ప్రసాదరెడ్డి, కాటసాని తిరుపాలరెడ్డి, కాటసాని చంద్ర శేఖర్ రెడ్డి, కాటసాని ఓబులరెడ్డి, కాటసాని రమాకాంత రెడ్డి, కాటసాని వెంకటేశ్వర రెడ్డిలు ఆమె మృతి తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసి మృతదేహం వద్ద అశ్రునయనాలతో నివాళులు అర్పించారు. కాటసాని తల్లి మృతిపట్ల పలువురు రాజకీయనాయకులు ఉమ్మడి జిల్లా జడ్పి చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన రెడ్డి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, చల్లా కుటుంబీకులు చల్లా సూర్యప్రకాశ రెడ్డి, చల్లా రాజశేఖర్ రెడ్డి, చల్లా విజయభాస్కర్ రెడ్డి, అవుకు జడ్పిటిసి చల్లా శ్రీలక్ష్మి మాజీ జడ్పిటిసి ఎర్రబోతుల ఉదయభాస్కర రెడ్డి, పెద్ద సంఖ్యలో కాటసాని అభిమానులు, వైకాపా నాయకులు,కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు గుండ్లసింగవరం వచ్చి ఎమ్మెల్యే కాటసానికి తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసి, కి.శే కాటసాని పుల్లమ్మ మృతదేహానికి ఘనంగా నివాళులర్పించారు.