NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెరికె వరప్రసాద్ కు బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు..

1 min read

– ఈ సేవా పురస్కారం నాకు మరింత బాధ్యత పెంచింది

 – పెరికె వరప్రసాదరావు వెల్లడి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా :  సెయింట్ జాన్ వెల్ఫేర్ సొసైటీ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు పెరికె వరప్రసాద్ రావు కు బెస్ట్ సోషల్ వర్క్ అవార్డు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు  ఐఏఎస్ వారి చేతుల మీదగా  మంగళవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేదికపై అందుకొన్నారు. సేవా పురస్కారం తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని సెయింట్ జాన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు పెరికె వరప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు. జనార్న్యాన్ని గడగడలాడించిన కోవిడ్ లో వేలాదిమందికి అన్నదానం, వస్త్ర దానo, మెడికల్ క్యాంపులు, నిత్యవసర సరుకులు, మాస్కులు పంపిణీ అత్యవసర రవాణా ఇలా అనేక సేవా కార్యక్రమాలు  చేసినందుకుగాను  బెస్ట్ సోషల్ వర్క్ అవార్డు గ్రహీతగా మొదట వరుసలో నిలిచారు. రాష్ట్ర ప్రభుత్వం తన సేవలను గుర్తించి ప్రశంసా పత్రన్ని ఉన్నతాధికారుల సమక్షంలో అందుకోవటం ఆనందంగా ఉందని తనకు ఈ పురస్కారం మరింత బాధ్యత పెంచిందని అవార్డును అందించినందుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్  ఢిల్లీ రావు ని ప్రత్యేకంగా అభినందించడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన మరియు మైనార్టీ వర్గాల వారికి  సంక్షేమ పథకాలు, ఫలాలు అందిస్తున్న తీరు తనకు ఆదర్శంగా నిలిచాయని ఆయన స్ఫూర్తితో  వైయస్ జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో సేవా కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా మరింత విస్తృతం చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సంపత్ ఐఏఎస్  తదితరుల అధికారులకు వరప్రసాదరావు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

About Author