నేరాలు జరగకుండా అప్రమత్తం వహించాలి
1 min read– పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక చేసిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశిల్
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : చెన్నూరు పోలీస్ స్టేషన్ ను మంగళవారం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశిల్ ఆకస్మిక తనిఖీ చేశారు, ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్ ఆవరణ ను పరిశీలించారు, అక్కడ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మొక్కలు సిబ్బందికి నాటాలని తెలిపారు, అలాగే ఆయన పోలీస్ స్టేషన్ లోని పలు రికార్డులను పరిశీలించడంతోపాటు సిబ్బంది పనితీరుపై ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి ని అడిగి తెలుసుకున్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రికెట్ బెట్టింగ్, డ్రగ్స్, బాల్య వివాహాలు, దిశా యాప్, మహిళల నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు, సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల పై ఉపేక్షించరాదని, పాఠశాలలు, బహిరంగ ప్రదేశాలలో ప్రజలలో అవగాహన వచ్చే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు, శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా విధులు నిర్వహించాలని ఆయన తెలిపారు, సంఘవిద్రోహుల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు వారిపై చర్యలు తీసుకునే విధంగా ఉండాలని తెలిపారు, ఎవరైనా విధుల పట్ల అలసత్వం వహించి నట్లయితే అలాంటి వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీనివాసులు రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.