భగత్‌సింగ్ పోరాట స్ఫూర్తి..
1 min read
భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న హసీనాబేగం
యువతకు ఆదర్శం..
– ఎన్‌డబ్ల్యూపీ జిల్లా అధ్యక్షురాలు ఎస్.హసీనాబేగం
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: దేశాన్ని బ్రిటీష్ బానిస బంధనాల నుండి విముక్తి చేయడానికి సర్దార్ భగత్‌సింగ్ సహా రాజగురు, సుఖదేవ్‌ల స్ఫూర్తి.. నేటి యువతకు ఆదర్శమని ఎన్‌డబ్ల్యూపీ జిల్లా అధ్యక్షురాలు ఎస్.హసీనాబేగం అన్నారు. ఆ ముగ్గురు యువ నేతలు దేశం కోసం ఉరికంభమెక్కారని, ఆనాటి త్యాగధనుల పోరాట ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర్య భారతదేశం.. నేడు స్వదేశీ, విదేశీ కార్పొరేట్ల చేతిలో నలిగిపోతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోరాట యోధుడు భగత్ సింగ్ 90వ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్.హసీనాబేగం మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలను అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. ఈ నెల 26న చేపట్టే భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్‌డబ్ల్యూపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.