ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలకు రెక్కలు
1 min read
పల్లెవెలుగు వెబ్: దిగ్గజ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. దాదాపు 20 శాతం టారిఫ్‌ను పెంచింది. అలాగే ప్లాన్ల ధరలను 20 నుంచి 25 శాతం పెంచుతున్నట్లు టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ ప్రకటించింది. పెంచిన ధరలు ఈ వారం నుంచి అంటే నవంబర్ 26 నుంచి అమల్లోకి రానున్నాయి. ఎయిర్‌టెల్ చివరిసారిగా.. 2019 డిసెంబర్‌లో టారిఫ్ ను పెంచిన సంగతి తెలిసిందే. పెరిగిన టారిఫ్‌తో దేశంలో 5జీ టెక్నాలజీ ప్రారంభానికి దోహదపడుతుందని ఎయిర్ టెల్ వర్గాలు తెలిపాయి.
రీఛార్జ్ ప్లాన్లు… పెరిగిన ధరలు
ప్రసుత్తం అమల్లో ఉన్న రూ.79 ప్లాన్‌ను రూ.99 కి పెంచింది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 200ఎంబీ డేటా వాడుకోవచ్చు. వాయిస్ టారిఫ్ సెకన్‌కు ఒక పైసా చొప్పున చెల్లించాలి. 50 శాతం ఎక్కువ టాక్‌టైమ్ రాబోతుంది.
రూ.149 ప్లాను..రూ.179
రూ.149 ప్లాన్‌ను రూ.179కి పెరిగింది. ఈ ప్లాన్ 28 రోజుల వేలిడిటీ, అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. 2జీబీ డేటా లభిస్తుంది. అలాగే రూ.219 ప్లాను… రూ.265కు పెరగనుంది. 28 డేస్ వ్యాలిడిటీ.. డైలీ 1 జీబీ డేటా వాడుకోవచ్చు. అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.
రూ.399.. ఇక రూ.479
రూ.399 ప్లాన్‌ను రూ.479కి పెరగనుంది. 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు, 1.5జీబీ డేటా లభిస్తుంది.
రూ.479..ఇక రూ.549
ఈ ప్లాన్ 56 రోజుల వేలిడిటీ. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్‌లు, 2జీబీ డేటా లభిస్తుంది. అలాగే రూ.379 ప్లాను …ఇకపై రూ.455కు పెరగనుంది. 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్‌లు, మొత్తంగా 6జీబీ డేటా లభిస్తుంది.